ధోనీ భవితవ్యంపై సెలక్షన్‌ కమిటీ కీలక ప్రకటన..

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మైదానంలో అడుగుపెట్టక చాలా రోజులవుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో ఓటమి అనంతరం, ధోని భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతనికి బదులుగా జట్టుకు వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌, కే.ఎల్‌.రాహుల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో రాహుల్‌.. గత కివీస్‌ టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా అద్భుతంగా రాణించాడు. 


కాగా, భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా నూతనంగా నియమితులైన సునీల్‌ జోషి.. అతని టీం గత ఆదివారం, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, రాహుల్‌ తమ స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ధోనికి మాత్రం ఈ జట్టులో స్థానం లభించలేదు. ఈ సమయంలో, మీడియా ధోని గురించి అడగగా వారు.. ప్రస్తుతం జట్టులో వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఉన్నాడని తెలిపారు. రాహుల్‌ కూడా కీపర్‌గా అద్భుతంగా రాణించగలడని వారు ధీమా వ్యక్తం చేశారు.