బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా యూఎస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. నిక్‌జోనస్ అండ్ ఫ్యామిలీతో ప్రియాంక పలు కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్‌లో పాల్గొంటూ సందడి చేసిన ఫొటోలు ఎప్పటికపుడు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ప్రియాంక్-నిక్ జోడి తాజాగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ సారి జరుపుకున్న హోలీ వేడుకలు ప్రియాంకకు ప్రత్యేకమైనదిగా చెప్పాలి. ఎందుకంటే ప్రియాంక-నిక్ జంట రంగులు చల్లుకుని హోలీ జరుపుకుంది ఇండియాలో కావడం విశేషం.
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏర్పాటు చేసిన హోలీ వేడుకలకు ప్రియాంక, నిక్‌తోపాటు ప్రియాంక తల్లి మధు చోప్రా, స్నేహితురాలు తమన్నాదత్, బాలీవుడ్ తారలు, విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ కూడా హాజరయ్యారు. ప్రియాంక-నిక్ ఒకరిపైమరొకరు రంగులు చల్లుకుని హోలీని ఎంజాయ్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..గంట వ్యవధిలోనే 5 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.