ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీతో రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ర్టాల్లో కేసుల ఛేదనలో సహకరిస్తున్న తెలంగాణ పోలీస్‌శాఖ మరో అధునాతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాన్‌బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ అయి.. కోర్టులకు హాజరుకాకుండా తిరిగేవారిని గుర్తించేందుకు ఈ సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది. దీంతో ఎన్బీడబ్ల్యూ ఇష్యూ అయినవారు.. పోలీసుల వద్ద ఎక్కడ ఫింగర్ ప్రింట్ వేసినా ఈ టెక్నాలజీద్వారా ఇట్టే పట్టేయవచ్చు. ప్రపంచంలోనే అత్యాధునికమైన పాపిలాన్ సాంకేతిక పరిజ్ఞానం వాడకంతో అత్యధిక సక్సెస్‌రేట్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల వివరాలు, ఎక్కడెక్కడ కేసులు పెండింగ్ ఉన్నాయనే అంశాలను ఫింగర్‌ప్రింట్ బ్యూరో టెక్నాలజీలో జతచేస్తున్నారు. దీంతో నిందితుడు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఇతర పోలీస్‌స్టేషన్ల పరిధిలో, ఇతర నేరాలు చేస్తూ పట్టుబడినా.. రాత్రివేళల్లో గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు వాడుతున్న ఫింగర్‌ప్రింట్ మొబైల్‌చెక్ డివైజ్‌ల్లో వేలిముద్రవేసినా వెంటనే సంబంధిత పోలీస్‌అధికారి వద్ద ఉన్న ట్యాబ్‌లో రెడ్‌మార్క్‌తో పాప్‌అప్ వస్తుంది. దానిని ఓపెన్ చేయగానే ఏ స్టేషన్ పరిధిలోని కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది అనే
ఎన్బీడబ్ల్యూను పట్టేస్తది!